32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- March 12, 2026
కువైట్ః అల్-జహ్రా మరియు ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్‌లలో అధికారుల తనిఖీల సందర్భంగా 32 ఉల్లంఘనను జారీ చేసింది. ధరల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏడు కేంద్ర మార్కెట్లను మూసివేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఒసామా బూడై ఆదేశాల మేరకు తనిఖీ పర్యటనలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్‌లో, ఆమోదించబడిన నిబంధనలను ఉల్లంఘించి చికెన్ ధరను పెంచినందుకు ఒక ఉల్లంఘనతో పాటు, స్థానికంగా ఉత్పత్తి చేయబడిన కూరగాయల ధరలను పెంచినందుకు ఇన్‌స్పెక్టర్లు 18 ఉల్లంఘనలను జారీ చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అల్-జహ్రా గవర్నరేట్‌లో 13 ఉల్లంఘనలు నమోదు చేశారు. నేరస్థులను కమర్షియల్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ధరలను కృత్రిమంగా ధరలను పెంచడంపై మంత్రివర్గ నిర్ణయాలను ఉల్లంఘించినందుకు ఏడు కేంద్ర మార్కెట్‌లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
వినియోగదారుల హక్కులను కాపాడటానికి మార్కెట్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, ఉల్లంఘనలను అరికట్టడానికి మరియు ఆమోదించబడిన ధరలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







