ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- October 30, 2025
దోహా: ఖతార్ లో ఆహార సంబంధ కార్యాకలాపాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా షాపింగ్ కేంద్రాలు మరియు పర్యాటక ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ మరియు స్థానిక బ్రాండ్‌ల ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లపై ప్రత్యేకంగా కార్యాచరణను ప్రారంభించింది. ఈ మేరకు ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆయా ఫుడ్ రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు చేపట్టింది.
దాదాపు 545 రెస్టారెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా 634 నమూనాలను సేకరించినట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిని ఆహార భద్రతా ప్రయోగశాలలలో పరీక్షలకు పంపినట్లు పేర్కొంది. కాగా, అందులో అన్ని పదార్థాలు పరిమితుల్లోనే ఉన్నాయని నిర్ధారణ అయిందని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం మరియు భద్రతకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







