చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!

- October 30, 2025 , by Maagulf
చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!

రియాద్: స్థానిక మరియు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా రాజీ సేవలను మెరుగుపరిచినట్టు సౌదీ అరేబియా న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పుడు మెరుగైన న్యాయ సేవలను “తరధీ” అప్లికేషన్ ద్వారా పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు సౌదీ అరేబియా న్యాయశాఖ మంత్రిత్వశాఖ మంత్రి వాలిద్ అల్-సమానీ  యాప్ రెండవ వెర్షన్‌ను అధికారికంగా ప్రారంభించారు.  

కొత్త యాప్ న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సేవా నాణ్యతను మెరుగుపరచడం, విధానాలను వేగవంతం చేయడం మరియు సరళంగా సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.   ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ చేయబడిన ఒప్పందాలు చట్టబద్ధంగా అమలు అవుతాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com