GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!

- October 30, 2025 , by Maagulf
GDRFA దుబాయ్ కు \'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ\' అవార్డు..!!

దుబాయ్: దుబాయ్ లోన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA దుబాయ్) ప్రతిష్టాత్మకమైన "బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ స్ట్రాటజీ ఆఫ్ 2025" అవార్డును గెలుచుకుంది. మానవ శ్రేయస్సు కేంద్రంగా అధునాతన సాంకేతికతలను బాధ్యతాయుతంగా అమలుకు దక్కిన ఫలితమని GDRFA దుబాయ్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి హర్షం వ్యక్తం చేశారు.  తమకు ఏఐ అనేది ఒక టెక్నాలజీ కంటే ఎక్కువని తెలిపారు. ఇది బాధ్యత, పారదర్శకత,జీవన నాణ్యతను మరియు ప్రభుత్వ సేవలను మెరుగుపరచడానికి నిబద్ధతను కలిగి ఉన్న జాతీయ వ్యూహం అని వివరించారు.

తన నాయకత్వంలో GDRFA దుబాయ్ భవిష్యత్తు కోసం దుబాయ్ సంసిద్ధతకు మద్దతు ఇస్తూనే కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సురక్షితమై పద్ధతుల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం AI ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ అవార్డుతో టెక్నాలజీ, డిజిటల్ పాలన మరియు స్థిరమైన ఆవిష్కరణలకు దుబాయ్ కేంద్రంగా మారిందని తేటతెల్లం అయిందని, ప్రపంచ కేంద్రంగా ఎమిరేట్ ఖ్యాతిని కూడా బలోపేతం చేసిందని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com