రాజశేఖర్ 'బ్రూస్ విల్లీస్'క్యారెక్టర్ లో
- July 23, 2016
గతంలో అంకుశం చిత్రంతో పోలీస్ అంటే ఇలా ఉండాలని చూపించిన హీరో రాజశేఖర్ తర్వాత ఎన్నో పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో నటించారు. అయితే గత కొంత కాలంగా ఆయన నటించిన చిత్రాలు పెద్దగా విజయవంతం కావడం లేదు. ఇక రాజశేఖర్ పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ డైలాగ్స్ కోడితే అప్పట్లో తెగ మెచ్చుకునేవారు. ఇక రిమేక్ చిత్రాలు తీయడంలో ఆయన కు సాటి ఎవరూ లేరు. ఒకప్పుడు శేషు చిత్రంతో రిమెక్ తో అద్భుత విజయం సాధించాడు. తర్వాత గడ్డం గ్యాంగ్ సినిమా అట్టర్ ప్లాప్ మూట గట్టుకున్నాడు. ఇక లాభం లేదనుకొని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్న ఈ హీరో యంగ్ హీరోయిన్ తండ్రిగా వర్మ డైరెక్షన్‌లో 'పట్టపగలు' ఓ ఫిల్మ్ చేశాడు.. అది పత్తా లేకుండాపోయింది.ఈలోగా తేజ డైరెక్షన్‌లో మూవీ చేయనున్నట్టు వార్తలు వచ్చినా ఇప్పటికీ మొదలుకాలేదు. ఈ మద్య రాజశేఖర్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మొదట్లో రాజశేఖర్ విలన్ గానే రాణించారు..తర్వాత హీరోగా మంచి మంచి చాన్సులు కొట్టేయడంతో హీరోగా స్థిరపడ్డారు. తన సహనటి జీవితను ప్రేమ వివాహం చేసుకున్న రాజశేఖర్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చూస్తున్నారు. లేటెస్ట్‌గా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'డై హార్డ్'ని ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ఫ్రీమేక్ చేయబోతున్నాడట రాజశేఖర్.అయితే ఈ చిత్రంలో రాజశేఖర్ 'బ్రూస్ విల్లీస్'క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. ఇక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేయడంలో ఈ హీరోకి తిరుగులేదు. మొత్తానికి ఈ చిత్రంతో అయిన రాజశేఖర్ క్లిక్ అయితే సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ గా మొదలు అవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







