సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- November 01, 2025
దుబాయ్: దుబాయ్ లో జరుగుతున్న దుబాయ్ రైడ్ యాక్టివిటీ కోసం సాలిక్ నవంబర్ 2న టోల్ రేట్లను సవరించింది. నెల రోజుల దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2025లో భాగంగా నవంబర్ 2న దుబాయ్ రైడ్ నిర్వహిస్తున్నారు.
దుబాయ్ రైడ్ ఆరవ ఎడిషన్ ఆదివారం ఉదయం 6.15 గంటలకు షేక్ జాయెద్ రోడ్లో ప్రారంభం అవుతుంది. ఇందులో వేలాది మంది సైక్లిస్టులు పాల్గొంటారు.
పీక్ అవర్స్ ఉదయం 6 నుండి 10 వరకు Dh6 గా టోల్ రేట్స్ నిర్ణయించారు. సాయంత్రం 4 నుండి 8 వరకు పీక్ అవర్స్ సమయంలో సాధారణ Dh6 రేటుకు బదులుగా Dh4 ను వసూలు చేస్తారు. ఇక తక్కువ పీక్ అవర్స్ అయిన ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు మరియు రాత్రి 8 నుండి 1 వరకు Dh4 గా నిర్ణయించారు.
దుబాయ్ రైడ్లో పాల్గొనేవారు రెండు మార్గాల్లో ప్రయాణించవచ్చు. డౌన్టౌన్ దుబాయ్ గుండా 4-కిమీ మార్గం లేదా మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ వాటర్ కెనాల్ మరియు బుర్జ్ ఖలీఫాతో సహా నగరంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్మార్క్లతో పాటు 12-కిమీ రేసులో పాల్గొనవచ్చని ప్రకటించారు. ఇప్పటికే నవంబర్ 2న తెల్లవారుజామున 3.30 నుండి ఉదయం 10.30 గంటల వరకు ఈ రహదారులపై దుబాయ్ RTA ఆంక్షలను విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







