మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

- November 01, 2025 , by Maagulf
మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt), మైనారిటీ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తను అందించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ (TET) కోచింగ్ ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమ,శాఖ మంత్రి ఫరూక్ ప్రకటించారు.ఈ శిక్షణ ద్వారా రాష్ట్రంలోని మైనారిటీ అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాన్ని పొందనున్నారు.

మంత్రి ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలో విశేష ఫలితాలు సాధించింది. ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మైనారిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.తమ వివరాలను https://apcedmmwd.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com