బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతమైంది. భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన జరిగిన ఓపెన్ హౌస్ లో పలువురు భారతీయ పౌరులు పాల్గొన్నారు. ఎంబసీ కమ్యూనిటీ వెల్ఫేర్ బృందం, కాన్సులర్ బృందం మరియు ప్యానెల్ న్యాయవాదులతో పాటు వివిధ కమ్యూనిటీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు.
రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను చేయించడం ద్వారా రాయబారి జాకబ్ కార్యకలాపాలను ప్రారంభించారు. కమ్యూనిటీ సభ్యులు తమ పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటును నిరంతరం తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా లాజిస్టికల్ సమస్యలు లేదా అసౌకర్యాన్ని నివారించడానికి సకాలంలో వారి పాస్ పోర్టులను రెన్యూవల్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇండియన్ ఎంబసీ బాధిత భారతీయ పౌరులకు మద్దతుగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
బాధితులకు అవసరమైన బోర్డింగ్ మరియు వసతి అందించడం, అత్యవసర సర్టిఫికెట్లు జారీ చేయడం, విమాన టిక్కెట్లు ఏర్పాటు చేయడం, ప్రవాసుల మృత దేహాల రవాణాకు సహాయం అందించడం వంటి సేవలను ఎంబసీ అందజేస్తుందని వివరించారు. భారత ప్రభుత్వ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఓపెన్ హౌస్ సందర్భంగా పలు కేసులను వెంటనే పరిష్కరించామని, మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







