వాహనదారులకు బిగ్ అలర్ట్..
- November 01, 2025
న్యూ ఢిల్లీ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ ఫాస్ట్‌ట్యాగ్ పనిచేస్తుందా? ఓసారి చెక్ చేసుకోండి. అక్టోబర్ 31 తర్వాత నుంచి ఫాస్ట్‌ట్యాగ్స్ పనిచేయవు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనానికి (KYV) వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోవచ్చు.
కొంతకాలంగా, ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించని వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag KYV) బ్యాన్ చేస్తారని నివేదికలు వస్తున్నాయి. అయితే, ఎన్‌హెచ్ఏఐ ఈ పుకార్లను (KYV FASTag) తోసిపుచ్చింది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం KYV (Know Your Vehicle) ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు, కేవైవీ అప్‌డేట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అక్టోబర్ 31 నుంచి KYV తప్పనిసరి:
అన్ని వాహనదారులకు తమ ఫాస్టాగ్ పనిచేయాలంటే మీ వాహనానికి కేవైవీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇలా చేయడంలో విఫలమైతే ఫాస్టాగ్స్ ఇక చెల్లవు. వినియోగదారులు క్యాష్ రూపంలో టోల్ చెల్లించాల్సి వస్తుంది.
కేవైవీ అంటే ఏంటి?
కేవైవీ అంటే నో యువర్ వెహికల్. సాధారణంగా ఫాస్టాగ్ యూజర్లకు జారీ చేసే కేవైసీ (నో యువర్ కస్టమర్) సర్టిఫికేట్ మాదిరిగానే ఉంటుంది. కేవైవీ కింద వ్యక్తులు తమ వాహనానికి సంబంధించిన కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లలో వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), వాహనం ఫొటో, ఇతర అంశాలు ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా ఫాస్టాగ్స్ జారీ అవుతాయి.
బ్యాంక్ లేదా యాప్ ద్వారా వెరిఫికేషన్:
కేవైవీ జారీ చేసే బ్యాంకు వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు. వినియోగదారులు లాగిన్ అయ్యాక ‘Update KYV’ లేదా ‘Know Your Vehicle’ పై క్లిక్ చేయాలి. ఆపై అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి OTP వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెరిఫికేషన్ తర్వాత ట్యాగ్ “Active Verified ” అని చూపిస్తుంది.
డాక్యుమెంట్లు, ప్రాసెస్:
కేవైవీని పూర్తి చేసేందుకు యూజర్లు తమ వాహనం నంబర్, యజమాని పేరును చూపించే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)తో పాటు వ్యాలీడ్ ప్రూఫ్ (ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్) కొన్ని సందర్భాల్లో వినియోగదారు రీసెంట్ ఫొటోను అప్‌లోడ్ చేయాలి. కొన్ని వాహనాలకు, వాహన ప్లేట్, ఫాస్ట్ ట్యాగ్ చూపించే ఫ్రంట్ సైడ్ ఫొటోలు కూడా తప్పనిసరిగా సమర్పించాలి.
కేవైవీ (KYV) అప్‌డేట్ ఎందుకు ముఖ్యమంటే?
మీ ఫాస్టాగ్ దుర్వినియోగాన్ని నివారించేందుకు మీ కేవైవీని వెంటనే అప్‌డేట్ చేయాలి. NHAI అన్ని వాహనదారులకు వీలైనంత త్వరగా తమ KYV అప్‌డేట్ చేయాలని సూచించింది. మీ కేవైవీని అప్‌డేట్ చేయడంలో విఫలమైతే FASTag రద్దుతో పాటు బ్లాక్ అవుతుంది. ఫలితంగా టోల్ ప్లాజా వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. మీ ఫాస్టాగ్ బ్లాక్ కావడంతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
ఫాస్టాగ్ KYV ఎలా అప్‌డేట్ చేయాలి?
- FASTag యాప్ లేదా వెబ్‌సైట్‌లో మీ ఫాస్టాగ్ అకౌంటులో లాగిన్ అవ్వండి.
- Airtel Payments Bank, ICICI Bank, HDFC Bank, Park+, SBI, IDFC First Bank వంటి ప్లాట్‌ఫామ్‌లు FASTags జారీ చేస్తున్నాయి.
- ఇప్పుడు అకౌంట్ సెట్టింగ్ లేదా ప్రొఫైల్‌లో KYV ఆప్షన్ ఎంచుకోండి.
- వాహన నంబర్, లైసెన్స్ ప్లేట్ నంబర్, ఇంజిన్ నంబర్ వంటి వెహికల్ సంబంధించిన సమాచారాన్ని నింపండి.
- ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్ల ఫొటోలను అప్‌లోడ్ చేసి ఆపై Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
- మీ అన్ని డాక్యుమెంట్లు వెరిఫికేషన్ కోసం బ్యాంకు లేదా FASTag జారీ చేసే కంపెనీకి పంపుతారు.
- NHAI ప్రకారం..KYV అప్డేట్ ప్రక్రియపై సమాచారం కోసం వాహన యజమానులు తమ బ్యాంకు లేదా జారీ చేసే సంస్థను సంప్రదించవచ్చు.
- ఫిర్యాదులు లేదా సందేహాల కోసం నేషనల్ హైవే హెల్ప్‌లైన్ నంబర్ 1033ని సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







