‘శంబాల’ ట్రైలర్ రిలీజ్..

- November 01, 2025 , by Maagulf
‘శంబాల’ ట్రైలర్ రిలీజ్..

ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘శంబాల’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మాణంలో డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా.

ఇప్పటికే శంబాల సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా శంబాల ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా శంబాల ట్రైలర్ చూసేయండి.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊరిలో ఆకాశం నుంచి వచ్చి ఏదో రాయి పడుతుంది. అది పడ్డ దగ్గర్నుంచి అక్కడ మనుషులు చనిపోవడం, వింత సమస్యలు వస్తుంటాయి. దాన్ని పరిశీలించడానికి జియో సైంటిస్ట్ అయిన ఆది వెళ్తాడు. మరి ఆ ఊళ్ళో ఆది ఎదుర్కున్న సమస్యలు ఏంటి అని సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

శంబాల సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com