అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- November 01, 2025
ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ఆర్థికమాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీతో టాప్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నది. కంపెనీలకు పెరుగుతున్న ఆర్థిక భారం నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిపడ్డాయి. ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. టెక్ ప్రపంచంలో మరోసారి కంపెనీల వర్క్ కల్చర్ పై చర్చ మొదలైంది.
కారణం అమెజాన్ ఒక ఉద్యోగికి తెల్లవారుజామున 3గంటలకు పంపిన లేఆఫ్ మెసేజ్! ఆ సమయానికి ఎవరు ఊహించగలరు ఆ సమయానికి ఉద్యోగం పోయిందని మెసేజ్ వస్తుందని? రెడిట్ లో ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొలైంది.
ఒక యూజర్ సరదాగా ఇలా రాశాడు ‘3 ఏఎంలో అవుట్ లుక్ పని చేయడం మానేసింది, కానీ లేఆఫ్ మెసేజ్ మాత్రం సమయానికి వచ్చింది. ఎంత కఠినమైన పని!.
“అమెజాన్ నుండి: ఆఫీసుకి రాకముందు మీ పర్సనల్ లేదా వర్క్ ఇమెయిల్, స్పామ్ ఫోల్టర్ తో సహా చెక్ చేయండి. మీ రోల్కు సంబంధించిన సమాచారం అందులో ఉంటుంది’ ఇది విన్న తర్వాత చాలామంది టెక్ ఉద్యోగులు షాక్ అయ్యారు.
‘ఇప్పుడా? రాత్రివేళలోనే ఉద్యోగం పోయిందని చెప్పేస్తారా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ డెడ్ లైన్లు, రాత్రి మీటింగ్స్, నిద్ర లేకుండా పని చేసే టెక్ ఉద్యోగులకు ఇప్పుడు లేఆఫ్ మెసెజ్ కూడా రాత్రి రావడం కొత్త ఆందోళనగా మారింది.
ఓ మాజీ ఎఫ్ ఎఎఎన్ జి(ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్, గూగుల్) ఉద్యోగి తన అనుభవం షేర్ చేస్తూ భావోద్వేగంగా రాశాడు. ‘టెక్ ప్రపంచం నుంచి బయటకు రావడం, అది నా ఇష్టంతోనా లేక లేఆఫ్ కారణంగానా, కానీ చివరికి నాకు శాంతి దొరికింది. ఆయన ఇలా చెప్పారు.
తన స్నేహితుడు స్వచ్చందంగా,రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయాడు. వీసా భయం, భవిష్యత్తుపై అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇప్పుడైనా ఊపిరి పీల్చగలుగుతున్నాను, మళ్లీ సరిగ్గా నిద్రపోగలుగుతున్నాను’ అని రాశాడు.
అమెజాన్ ఈ వారం వరకు సుమారు 14,000 ఉద్యోగులను తొలగించింది. కంపెనీ వ్యక్తుల అనుభవం, సాంకేతికత విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి ఒక బ్లాగ్ లో ఈ విషయాన్ని తెలిపారు. ఆమె చాలా చెప్పారు.
ఈ తగ్గింపులు మా కంపెనీని మరింత బలంగా, సమర్థవంతంగా మార్చేందుకు చేస్తున్నాం. అనవసరమైన లేయర్లు తగ్గించి, కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత అవసరాలపై దృష్టి పెడుతున్నాం అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







