తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- November 02, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమం #ArriveAlive పేరుతో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసు DGP శివధర్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల కఠినమైన అమలు, మరియు రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై దృష్టి సారించనున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
పోలీసు విభాగం సమాచారం ప్రకారం, ఈ ప్రచారంలో డ్రైవర్లకు మరియు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై శిక్షణ, అవగాహన ర్యాలీలు, వర్క్షాప్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించనున్నాయి.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మహేష్ భగవత్(శాంతిభద్రతల అదనపు డీజీపీ) కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!







