నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

- November 02, 2025 , by Maagulf
నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

చెన్నై: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రాజ్యాంగ సూత్రాల ప్రాముఖ్యతను మరోసారి హైలైట్ చేశారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కృషి చేసిన న్యాయవ్యవస్థ సభ్యులు ఎల్లప్పుడూ ఒత్తిళ్లు, బదిలీలు, మానసిక వేధింపులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. వీఐటీ (వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులకు విలువైన సందేశం ఇచ్చారు.

జస్టిస్ రమణ మాట్లాడుతూ, “రాజ్యాంగం మన దేశానికి పునాది. దానిని రక్షించడమే ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగం కాపాడడంలో న్యాయవ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. కానీ, ఈ సూత్రాలను నిలబెట్టే జడ్జిలు తరచూ ఒత్తిడులు, బదిలీలు, బెదిరింపులు ఎదుర్కొంటారు.

నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టారు” అని చెప్పారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com