ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!

- November 02, 2025 , by Maagulf
ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!

మస్కట్: ఒమన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన తలాబత్ ఆర్డర్‌లు మరియు డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడింది.  గత రెండు రోజులుగా తాము ఆర్డర్‌లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.  అయితే, సేవలు నిలిచిపోవడంపై తలాబత్ ఒమన్ అధికారికంగా స్పందించలేదు. 

మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు చాలా రెస్టారెంట్లు "మూసివేయబడ్డాయి" లేదా "అందుబాటులో లేవు" అని మెసేజ్ చూపిస్తున్నట్లు తెలిపారు.

 ఒమన్‌లో చాలా మందికి తలాబత్ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.  ఇందులో దాదాపు 5 వేల వరకు సెల్లర్స్ ఉన్నారు.  కొనసాగుతున్న టెక్నికల్ సమస్య కస్టమర్లను ప్రభావితం చేయడమే కాకుండా, ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన అనేక స్థానిక రెస్టారెంట్లు మరియు డెలివరీ డ్రైవర్ల కార్యకలాపాలు, వారి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com