అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!

- November 02, 2025 , by Maagulf
అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!

కువైట్: కువైట్ లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. అల్-ఖైరాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో  చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాలను మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. 

ఈ ఆపరేషన్‌ లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు జనరల్ సెక్యూరిటీ సిస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ పర్యవేక్షణలో తనిఖీలను నిర్వహించాయి.  

ఈ సందర్భంగా 467 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా, 10 మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిర్బంధించారు.  దాదాపు 20 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను జప్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com