అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- November 02, 2025
యూఏఈ: అబుదాబిలో అనధికార క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్ల వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. పెడస్టేరియన్ మార్గాలు మరియు ఆట స్థలాలతో సహా పలు ప్రాంతాలలో వీటిని నడిపే టీనేజర్ల వల్ల కలిగే భద్రతా ప్రమాదాలను హైలైట్ చేస్తూ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నోటీసు జారీ చేసింది.
నివాస ప్రాంతాలలో ఇటువంటి వాహనాల వాడకం ఖచ్చితంగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై 50,000 దిర్హామ్ల వరకు జరిమానాలు విధించడంతోపాటు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే, వారి సంరక్షకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అబుదాబి పోలీసులు వార్నింగ్ జారీ చేశారు. అబుదాబి పోలీస్ యాప్ ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన అన్ని సంఘటనలను నివేదించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ నియమాలను పాటించాలని కోరారు. భద్రత పరమైన నిబంధనల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అబుదాబిలో ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్లు కనీసం 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రైడింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ మరియు రిఫ్లెక్టివ్ గేర్ ధరించాలి. నిర్దేశించిన లేన్లను మాత్రమే ఉపయోగించాలి. సాధారణంగా 15–20 కిలో మీటర్ల మధ్య వేగ పరిమితులను పాటించాలి. పాదచారుల క్రాసింగ్ల వద్ద నిబంధనలను పాటించాలని అధికారులు గుర్తుచేశారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







