షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- November 03, 2025
యూఏఈ: రక్షిత యానిమల్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని షార్జా అధికారులు అరెస్టు చేశారు. అంతరించిపోతున్న కొంగలు, నక్కలు వంటి రక్షిత జంతువులను విక్రయిస్తుండగా, దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం స్వాధీనం చేసుకున్న యానిమల్స్ ను షార్జా ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ రిజర్వ్స్ అథారిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో వాటిని నేచర్ రిజర్వ్ లలో వదిలేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
రక్షిత జంతువుల వ్యాపారానికి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద సమాచారాన్ని అందజేసి సహకరించాలని షార్జా పోలీసులు కోరారు. యూఏఈలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రమాదకరమైన జంతువును కలిగి ఉంటే Dh10,000 నుండి ప్రారంభమై Dh500,000 వరకు జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







