తెలంగాణలో మోదీ పర్యటన ఖరారు
- July 23, 2016
తెలంగాణలో భారత ప్రధాని మోదీ పర్యటన దాదాపు ఖరారైంది. ఈ షెడ్యూల్‌ను పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన పూర్తిసమాచారాన్ని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో కోరడంతో శనివారం సాయంత్రం అందజేసింది. ఆగస్టు 7న రామగుండం ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం, వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో మిషన్ భగీరథను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్..మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలసిందే. శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మోదీ మెదక్ జిల్లా ములుగులో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







