తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- November 03, 2025
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్లు అందరి వద్ద ఉంటున్నాయి.గూగూల్ మ్యాప్స్‌ను చాలా మంది వాడుతున్నారు.దీంతో గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సుల సమాచారం, రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది.
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, మీరు వెళ్లాల్సిన ప్రాంత వివరాలు టైప్ చేసి, ఎక్కాల్సిన బస్సు ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, డబ్బులు చెల్లిస్తే రిజర్వేషన్ పూర్తయి, మీ స్మార్ట్‌ఫోన్‌కే ఈ-టికెట్ వస్తుంది.
అంతేకాదు, రిజర్వేషన్ లేని బస్సుల్లోనూ గూగుల్ మ్యాప్స్‌లో టికెట్ తీసుకుని ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ వెబ్‌సైట్‌తో పాటు బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు కొని రిజర్వ్ చేసుకుంటున్నారు.
గూగుల్ మ్యాప్స్‌లో బస్సు టికెట్‌ను రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సర్వీసుల వివరాలను అధికారులు గూగుల్‌కు ఇవ్వనున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని గూగుల్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గూగుల్స్ మ్యాప్స్‌లో టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది.
మరో సదుపాయం..
మరోవైపు, ఇప్పటికే బస్సుల్లో టికెట్లు ఇచ్చే విధానంలోనూ స్వల్పమార్పులు చేయనుంది టీజీఎస్‌ఆర్టీసీ.బస్ ఎక్కిన తర్వాత ప్రయాణికులు టికెట్ తీసుకునే వేళ క్రెడిట్/డెబిట్ కార్డుతో చెల్లింపులు చేయొచ్చు.అయితే, ప్రయాణికులు పిన్ నంబరును నమోదు చేసే సమయంలో ఎక్కువ సమయం పడుతుండడంతో లేట్ అవుతోంది. దీంతో క్రెడిట్/డెబిట్ కార్డును ప్రయాణికులు టిమ్ మిషన్‌పై పెట్టగానే నగదు చెల్లింపులు జరిగే విధానాన్ని ఆర్టీసీ తీసుకురానుంది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







