విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- November 05, 2025
మస్కట్: ఒమన్ లో తప్పిపోయిన వ్యక్తి కథ విషాదాంతమైంది. అతడిని చనిపోయన స్థితిలో కనుగొన్నారు. కోస్ట్ గార్డ్ పోలీసుల నేతృత్వంలోని మారిటైమ్ రెస్క్యూ బృందాలు తప్పిపోయిన పౌరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ముత్రాలోని విలాయత్‌లోని పోర్ట్ సుల్తాన్ కబూస్ నుండి దాదాపు ఒక నాటికల్ మైలు దూరంలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ముత్రాలోని వాడి నివాసి అయిన ఆ వ్యక్తి గత ఆదివారం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి అతని గురించి అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చివరకు పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







