ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- November 05, 2025
దోహా: ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 అధికారికంగా ఆస్పైర్ జోన్ కాంపిటీషన్ కాంప్లెక్స్‌లో ఎనిమిది మ్యాచ్‌లతో ప్రారంభమైంది. ఇందులో తొలిసారిగా 48 జట్లు పాల్గొంటున్నాయి. ఖతార్ ఫుట్‌బాల్ దిగ్గజాలకు నివాళిగా ఇటీవల పేరు మార్చిన ఎనిమిది వేదికలలో ఒకటైన మన్సోర్ ముఫ్తా పిచ్‌లో ఇటలీతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్ 1-0 తేడాతో ఓటమి పాలైంది.
ఖతార్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐదు U-17 టోర్నమెంట్లలో ఇది మొదటిది అని స్థానిక నిర్వాహక కమిటీ (LOC) చైర్మన్ షేక్ హమద్ బిన్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ థాని తెలిపారు. ఈ ఈవెంట్ అన్ని స్థాయిలలో ఫుట్‌బాల్‌ను ముందుకు తీసుకెళ్లడానికి, రేపటి ఫుట్‌బాల్ స్టార్ల పెరుగుదలకు సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
FIFA U-17 ప్రపంచ కప్ 2025 నవంబర్ 27 వరకు జరుగుతుంది. మొత్తం 48 దేశాలు పన్నెండు గ్రూపులుగా పోటీ పడుతున్నాయి. ఆస్పైర్ జోన్ కాంపిటీషన్ కాంప్లెక్స్‌లోని ఎనిమిది పిచ్‌లలో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 27న ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







