'మైఖెల్ జాక్స‌న్' బ‌యోపిక్..టీజ‌ర్‌ వచ్చేసింది..

- November 06, 2025 , by Maagulf
\'మైఖెల్ జాక్స‌న్\' బ‌యోపిక్..టీజ‌ర్‌ వచ్చేసింది..

వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ మైఖెల్ జాక్స‌న్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన పాటలు, డాన్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పాప్ కింగ్ జీవిత కథ ఆధారంగా “మైఖెల్” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాఫ‌ర్ జాక్స‌న్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కిస్తున్నాడు. తౌరా హ‌రియ‌ర్‌, నియా లాంగ్‌, (Michael Teaser)జులియానో వ‌ల్ది కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా “మైఖెల్” సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. మైఖెల్ జాక్సన్ జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని ఈ సినిమాలో క్లియర్ గా చూపించనున్నట్టుగా అర్థం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com