అనుమానిత ఉగ్రవాదులును ఏటీఎస్ అధికారులు అరెస్ట్...
- July 24, 2016
అనుమానిత ఉగ్రవాదులుగా శనివారంనాడు ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేసిన రిజ్వాన్ ఖాన్, ఈవారంలోనే నవీ ముంబైలో అదుపులోకి తీసుకున్న అర్షిద్ ఖురేషీల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఇద్దరూ కలిసి సుమారు 800 మందిని ఇస్లాం మతంలోకి మార్చారట. ఈ విషయం తమ విచారణలో వెల్లడైనట్టు ఏటీఏస్ అధికారులు తెలిపారు. వీరిని మరింత లోతుగా విచారించిన ఉన్నతాధికారులు కీలక వివరాలు రాబట్టారు. పట్టుబడిన ఇద్దరికీ వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు జకీర్ నాయక్ నిర్వహిస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, ఖాన్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, వివాహ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. క్రిస్టియన్, హిందూ మతాలకు చెందిన 800 మందికి పైగా ప్రజలను వీరు ముస్లిం మతంలోకి మార్చినట్టు ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైనట్టు చెప్పారు. అరెస్టయిన ఇద్దరికీ ఐఆర్‌ఎఫ్‌తో పాటు మరో రెండు సంస్థలతో సంబంధాలున్నాయని, ఆ సంస్థలతో కలిసి వీరు పెద్దఎత్తున మతమార్పుడులు జరిపారని ఏటీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. 'మా విచారణలో వెల్లడైన విషయాలు చాలా కీలకమైనవి. మతమార్పిడులతో ప్రమేయం ఉన్న సంస్థలు ప్రధానంగా విద్యార్థులు, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని వారికి లీగల్ పరమైన, ఆర్థిక పరమైన సహాయం అందిస్తున్నట్టు పట్టుబడిన వ్యక్తులు విచారణలో వెల్లడైంది' అని ఏటీఏస్ అధికారి ఒకరు తెలిపాయి. కాగా, మతమార్పిడులతో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సంస్థ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఖాన్ అప్పుడప్పుడూ తమ కార్యాలయానికి వచ్చేవాడని, అయితే తమ సంస్థ కార్యకలాపాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







