'అనుమాన పక్షి' కాశ్మీర్‌లోని పహల్గామ్లో కీలక షెడ్యూల్ పూర్తి
- November 08, 2025
రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అనుమాన పక్షి'. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత.
సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తాజాగా కశ్మీర్‌లోని పహల్గామ్, శ్రీనగర్ ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో అక్కడ జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ పహల్గామ్లో షూట్ చేసిన తొలి సినిమా ఇది.
సీఆర్పీఎఫ్ మార్గదర్శకత్వంలో, అన్ని భద్రతా నియమాలు పాటిస్తూ 20 రోజుల పాటు ఇంటెన్స్ షెడ్యూల్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమాకి దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్ చివర్లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇటివలే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
ప్రిన్స్ సెసిల్, అనన్య, చారిత్ కీలక పాత్రల్లో కనిపించగా, బ్రహ్మాజీ, అజయ్, సీనియర్ నటి రాశి యూనిక్ రోల్స్‌లో కనిపించనున్నారు.
విభిన్న కథతో, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న “అనుమానపక్షి” త్వరలో థియేటర్లలోకి రానుంది.
తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్ - చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : శ్రావణ్ కుప్పిలి
డీవోపీ: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్ : అభినవ్ కునపరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్య తబస్సుమ్
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









