అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- November 23, 2026
రియాద్: అవయవ మార్పిడి చికిత్సల్లో సౌదీ అరేబియాకు చెందిన కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSH) అరుదైన ఘనత సాధించింది. 2023, 2024 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన లివర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సల్లో దాదాపు 63 శాతం ఈ ఆసుపత్రిలోనే నిర్వహించారు. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (SCOT) గణాంకాల ప్రకారం ఈ రెండేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 1,018 లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు జరగగా, అందులో దాదాపు మూడింట రెండొంతుల శస్త్రచికిత్సలు KFSHలోనే జరిగాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా జరిగిన మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సల్లోనూ దాదాపు సగం ఈ ఆసుపత్రిలోనే నిర్వహించారు.
గత నాలుగేళ్లుగా వరుసగా ఏడాదికి 1,000కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఆసుపత్రి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2022 నుంచి 2025 వరకు మొత్తం 4,330 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించింది. 2025లోనే 1,109 శస్త్రచికిత్సలు జరిగాయి. వీటిలో మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమగ్రంథి, పేగుల మార్పిడి చికిత్సలు ఉన్నాయి. మూత్రపిండాల మార్పిడి కార్యక్రమంలో చికిత్స పొందిన రోగుల విషయంలో ఏడాది తర్వాత జీవించే వారి శాతం, మార్పిడి చేసిన అవయవం సక్రమంగా పనిచేస్తున్న శాతం 97 నుంచి 99 మధ్య నమోదైంది.
2025లో ఆసుపత్రి అవయవ మార్పిడి క్లినిక్‌లలో సుమారు 86,000 ఫాలో-అప్ విజిట్స్ నమోదయ్యాయి. అత్యాధునిక శస్త్రచికిత్సా విధానాల్లోనూ KFSH ముందంజలో ఉంది. 2023లో ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి రోబోటిక్ విధానంలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. అనంతరం 2024లో ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి రోబోటిక్ గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేపట్టింది. ఈ టెక్నాలజీలో క్లిష్టమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో శరీరానికి కలిగే గాయాలను తగ్గించేందుకు దోహదపడుతున్నాయి.
వైద్యరంగంలో సాధించిన విజయాలకు గుర్తింపుగా 2026లో ప్రపంచంలోని 250 అత్యుత్తమ అకడమిక్ మెడికల్ సెంటర్లలో KFSH ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానాన్ని, మిడిలిస్ట్-ఆఫ్రికా ప్రాంతంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అదే విధంగా బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2026లో సౌదీ అరేబియా, మధ్యప్రాచ్యంలో అత్యంత విలువైన హెల్త్‌కేర్ బ్రాండ్‌గా ఈ ఆసుపత్రిని గుర్తించింది. న్యూస్‌వీక్ ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026, వరల్డ్స్ బెస్ట్ స్మార్ట్ హాస్పిటల్స్ 2027, వరల్డ్స్ బెస్ట్ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ 2027 జాబితాల్లోనూ KFSH చోటు సంపాదించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు







