కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!

- November 23, 2026 , by Maagulf
కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!

కువైట్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (Ek Ped Maa Ke Naam) ప్రచారంలో భాగంగా నవంబర్ 21న రిగ్గే, అండలూస్ పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ARMS4U, అమ్మా కువైట్ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

కువైట్‌లో భారత రాయబారి పరమితా త్రిపాఠి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. భారతీయ ప్రవాసులు, స్వచ్ఛంద కార్యకర్తలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా వారిని ప్రోత్సహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ 2024 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. పచ్చదనం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com