శ్రీలీల లాంచ్ చేసిన ‘ప్రేమంటే’ వెడ్డింగ్ సాంగ్ ‘పెళ్లి షురూ’
- November 10, 2025
ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.
పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత.
ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మనుసుని హత్తుకునే ప్రేమకథపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.
ఈ రోజు చిత్రంలోని రెండో పాట ‘పెళ్లి షురు'ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేశారు.
ఇది ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్. హీరో–హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీ లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే మనసును కట్టిపడేస్తుంది.
శ్రీమణి రాసిన సాహిత్యం, కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్న జంట భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేసింది. చాలా రోజుల తరువాత తెలుగు పాటకు వాయిస్ అందించిన శ్రేయా ఘోషాల్ తన మధురమైన వోకల్స్ పాటకు కొత్త అందాన్ని తెచ్చారు. హిందీలో కుబేరా సినిమాకు హిట్ పాటలు పాడిన దీపక్ బ్లూ తన ఎనర్జిటిక్ వాయిస్ కలసి ఈ ట్రాక్‌ను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
విజువల్ గా పాట అద్భుతంగా వుంది. కాంతులతో, నవ్వులతో, సంతోషంతో నిండిన వివాహ వాతావరణం తెరపై కలర్ పుల్ గా కనిపిస్తోంది.
ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యుతీఫుల్ డ్యాన్స్ మూవ్స్ తో పాటకు జీవం పోశారు. ఈ పాట తెలుగు పెళ్లిళ్లలో మస్ట్ ప్లే సాంగ్‌గా మారబోతోంది.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది.గామి సినిమాకి గానూ గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి డీవోపీగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్‌ను రాఘవేంద్ర తిరున్ పర్యవేక్షిస్తారు. ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ ములే. కార్తీక్ తుపురాని, రాజ్‌కుమార్ డైలాగ్స్ రాశారు.
నటీనటులు: ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు: పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్
సమర్పణ: రానా దగ్గుబాటి
బ్యానర్లు: SVCLLP, స్పిరిట్ మీడియా
సహ నిర్మాత: ఆదిత్య మేరుగు
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
డైలాగ్స్: కార్తీక్ తుపురాణి & రాజ్‌కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
మ్యూజిక్ ఆన్: సరిగమ
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







