తిరువీర్, గంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 2 గ్రాండ్ గా లాంచ్
- November 10, 2025
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ప్రీ వెడ్డింగ్ షో'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు.
తమ ఫస్ట్ ప్రొడక్షన్ శివమ్ భజేతో ప్రేక్షకులని అలరించిన గంగాఎంటర్‌టైన్‌మెంట్స్, మరో ఎక్సయిటింగ్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, మసూద నుంచి ప్రీ వెడ్డింగ్ షో వరకు డిఫరెంట్ జానర్లలో ఆకట్టుకున్నారు. ఈ కొత్త సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: మహేశ్వర రెడ్డి మూలి
దర్శకత్వం: భరత్ దర్శన్
డీవోపీ: CH కుషేందర్
సంగీతం: భరత్ మంచిరాజు
ఆర్ట్ డైరెక్టర్: తిరుమల ఎం తిరుపతి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: అను రెడ్డి అక్కటి
లిరిక్స్: పూర్ణాచారి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







