రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- November 11, 2025
రెనో: రెనోలో నాట్స్,ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నెవెడాలోని రెనోలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది.ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ నార్త్ నెవాడా (IACCNN)తో కలిసి నాట్స్ నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి వైభవం, ఐక్యతా స్పూర్తిని ప్రతిబింబించాయి.రెనో నగరంలోని గ్రాండ్ సియెర్రా రిసార్ట్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సుమారు 300 మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో దీపావళి కాంతుల్లో సంతోషం వెల్లివెరిసింది.ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ గాయని సుమంగళి అందించిన సంగీత కచేరీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా సమన్వయం చేసిన లలితా నాయకత్వం అందరికీ స్ఫూర్తినిచ్చేలా నిలిచింది.లలితా కృషి నిబద్ధత, సత్సంకల్పం వల్ల దీపావళి వేడుకలు దిగ్విజయం అయ్యాయి. ఐఎసీసీఎన్ఎన్, నాట్స్ సంస్థల ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుక ద్వారా భారతీయుల ఐక్యతను ప్రతిబింబించింది. సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, భారతీయ విలువల పట్ల ఉన్న గౌరవాన్ని ఇది చాటింది. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి వివరించారు. ప్రవాస భారతీయులు కలిసి చేసుకునే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన అన్నారు. రెనో నగరంలో ప్రవాస భారతీయుల సమైక్యతకు ఈ దీపావళి వేడుకలే నిదర్శమని మధు బోడపాటి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







