ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- November 11, 2025
యూఏఈ: షార్జా ఎయిర్ పోర్ట్ ప్రయాణికులు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై తమ ఇళ్ళు, హోటళ్ళు లేదా కార్యాలయాల నుండి సౌకర్యంగా వారి చెక్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా కొత్త సేవను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
కొత్త సర్వీస్ 'హోమ్ చెక్-ఇన్' ద్వారా ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, వారు క్యూలను దాటి నేరుగా పాస్‌పోర్ట్ సెక్షన్ కు వెళ్లవచ్చని తెలిపింది. బోర్డింగ్ పాస్‌లను జారీ చేయడం నుండి ప్రయాణీకుల ఇంటి నుండి నేరుగా లగేజీ సేకరించడం వరకు షార్జా ఎయిర్ పోర్ట్ టీమ్ ప్రతిదీ చూసుకుంటుందని వెల్లడించారు.
ప్రయాణికులు www.sharjahairport.ae ద్వారా లేదా 800745424 కు కాల్ చేయడం ద్వారా లేదా SHJ హోమ్ చెక్-ఇన్ మొబైల్ యాప్ ద్వారా సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫ్లైట్ బయలుదేరడానికి కనీసం ఎనిమిది గంటల ముందు బుకింగ్‌లు చేసుకోవాలని సూచించింది.
బ్యాగుల సంఖ్య ఆధారంగా ప్యాకేజీల ధరను నిర్ణయించారు. కోరల్ ప్యాకేజీ కింద 1–2 బ్యాగులకు Dh145, సిల్వర్ ప్యాకేజీ కింద 3–4 బ్యాగులకు Dh165, గోల్డ్ ప్యాకేజీ కింద 6 బ్యాగుల వరకు Dh185 వసూలు చేయనున్నారు. ఎయిర్‌లైన్ బ్యాగేజీ పాలసీకి అనుగుణంగా అదనపు బ్యాగుల ధర ఒక్కొక్కటి Dh20గా నిర్ణయించారు. ఈ సేవ ప్రస్తుతం మొదటి దశలో ఉందని, షార్జాలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులో ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







