కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- November 12, 2025
కువైట్ః మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా పర్యవేక్షణ కఠినతరం చేసినట్లు కువైట్ బ్యాంకులు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.వ్యక్తిగత ఖాతాల్లోకి అసాధారణ రీతిలో ఒకేసారి పెద్ద మొత్తం జమకావడంపై సమీక్ష జరుపనున్నారు. వాణిజ్య లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వ్యక్తిగత ఖాతాలను ఉపయోగిస్తున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. "వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించకూడదు" అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
పారదర్శకతను నిర్ధారించడం, ఆర్థిక మార్గాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆర్థిక ప్రమాణాలకు కువైట్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







