ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- November 12, 2025
కువైట్: కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా కొత్త కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ ను పరిశీలించారు. టెర్మినల్‌లో జరిగే వీక్లీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆ స్థలాన్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా మంత్రులతో పాటు, ప్రజా పనుల మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
ఇది కువైట్‌లోని మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టులలో ఒకటి అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనుకున్న ప్రకారం నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు కువైట్ ప్రధాన మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







