సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- November 14, 2025
రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో (IND vs SA) జరిగిన మొదటి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 285 పరుగులు చేయగా, భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ 129 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా-ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఇండియా-ఏ (IND vs SA) బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లతో పాటు హర్షిత్ రాణా మెరుపు దాడికి దిగారు. అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆరంభపు స్పెల్స్ కారణంగా సఫారీ జట్టు కేవలం 1 పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 16 పరుగులకే నాలుగో వికెట్, 53 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో డియాన్ ఫారెస్టర్ (77 పరుగులు), డెలానో పోట్గెటర్ కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. చివర్లో పోట్గెటర్ 90 పరుగులు చేయగా, బిజోర్న్ ఫార్టూయిన్ 59 పరుగులు జోడించి స్కోర్‌ను 285 పరుగులకు చేర్చడంలో ముఖ్యపాత్ర వహించారు.
286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ (31), రియాన్ పరాగ్ (8) పెద్ద స్కోర్లు చేయకుండానే అవుటయ్యారు. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.గైక్వాడ్ యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
గైక్వాడ్ అద్భుతంగా ఆడి 117 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని సెంచరీ భారత జట్టు విజయాన్ని దాదాపు ఖాయం చేసింది. చివరి ఓవర్లలో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
ఒత్తిడిలో నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 26 బంతుల్లో 37 పరుగులు చేసి, నిశాంత్ సింధుతో కలిసి 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సింధు చివరి వరకు క్రీజులో నిలిచి 29 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఇండియా-ఏ జట్టు ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక వన్డే మ్యాచ్ నవంబర్ 16న జరగనుంది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







