‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
- November 16, 2025
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న “ఆంధ్ర కింగ్ తలుకా” సినిమా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అభిమానిపై ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మంచి హైప్‌ను తీసుకువచ్చాయి. ఈ చిత్రానికి మహేష్ బాబు.P దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ను నవంబర్ 18న కర్నూలులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఆ ఈవెంట్‌ను ఎన్నడూ కనిపించని స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ (Andhra King Taluka Trailer) సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, ఓ భారీ డ్రోన్ షో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సినిమా ప్రేమికులు భారీ సంఖ్యలో హాజరవుతారని, ఈ ఈవెంట్ పూర్తి స్థాయిలో క్రియేటివ్, సెన్సేషనల్, చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. భవ్యమైన ప్రొడక్షన్ విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని ప్రముఖ జంట వివేక్–మర్విన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







