ఆధ్య మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గ్రాండ్ గా లాంచ్
- November 16, 2025
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ప్రీ వెడ్డింగ్ షో'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు.
ఈ రోజు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టారు. దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ కు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు స్వరూప్ మేకర్స్ కు స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సరదా, సందడితో కూడిన ఓ అద్భుతమైన ప్రేమకథగాఉండబోతోంది.
ఈ చిత్రానికి జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేందర్ కుడుదుల, రవీంద్ర ఎల్వీ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. మహి డెరంగుల కాస్ట్యూమ్ డిజైనర్. కొమిరి బాలసుబ్రహ్మణ్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఈ చిత్రానికి సంబధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీ నటులు: తిరువీర్
రచన దర్శకత్వం: మహేందర్ కుడుదుల.
బ్యానర్ : ఆద్య మూవీ మేకర్స్
నిర్మాత: పరుచూరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
స్క్రీన్ ప్లే: మహేందర్ కుడుదుల, రవీంద్ర ఎల్వీ
కాస్ట్యూమ్ డిజైనర్: మహి డెరంగుల.
ప్రొడక్షన్ కంట్రోలర్ : కె. ఉమాశంకర్ రాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొమిరి బాలసుబ్రహ్మణ్యం
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







