21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- November 17, 2025
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు.ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీపెద్దలు సీపీ సజ్జనార్‌తో అయ్యారు.ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. “పైరసీ కారణంగా సినీ రంగానికి చాలా నష్టం జరిగింది.దీన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడం జరిగింది.రవిపై ఇప్పటికే ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ పైరసీకి సంబంధించి ఇప్పటికే శివరాజ్, ప్రశాంత్ లను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇమ్మడి రవి కేవలం పైరసీ ద్వారానే కాకుండా బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేస్తున్నాడు.
దానివల్ల చాలా మంది అమాయకులు చనిపోయారు.వెబ్ సైట్ క్రియేట్ చేయడంలో రవి ఆరితేరాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే..కొత్త సైట్‌ను తయారు చేసేవాడు.అలా ఏకంగా 65 మిర్రర్ వెబ్‌సైట్లు అతను నిర్వహించాడు.అతడి దగ్గర దొరికిన హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు ఉన్నాయి. అందులో, 1972లో రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ నుంచి 2025 ఓజీ వరకు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ ద్వారా రవి ఏకంగా రూ.20 కోట్లు సంపాదించాడు.ఐబొమ్మను యూస్ చేస్తున్న దాదాపు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా అతను దగ్గర ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం చాలా ప్రమాదకరం”అంటూ తెలిపారు సజ్జనార్.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







