‘మహారాణి’గా నయనతార..
- November 18, 2025
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్న(NBK 111) విషయం తెలిసిందే. వ్రిద్ది సినిమాస్ తెరకెక్కస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేశారు.మహారాణిగా నయన్ లోక్ నెక్స్ట్ లెవల్లో ఉంది.
దీనికి సంబంధించి విడుదలైన వీడియోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇక బాలకృష్ణ లుక్ ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక బాలకృష్ణ-నయనతార కాంబోలో ఇప్పటికే సింహా, జై సింహ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచాయి.ఇక గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా చేసి సక్సెస్ సాధించాడు.కాబట్టి, ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ భారీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!







