సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత

- November 18, 2025 , by Maagulf
సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత

అమెరికా: అమెరికా ప్రభుత్వం, కుఖ్యాత గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను అధికారికంగా భారత్‌కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యవేక్షణ, న్యాయ ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత అతడిని భారత్‌కు పంపించేందుకు US అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థలు అతడిని దేశానికి తరలిస్తున్నాయి.

అన్మోల్ పేరు అనేక హై–ప్రొఫైల్ నేరాల్లో వినిపించింది.ముఖ్యంగా, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యాయత్నం, అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలో అతడు కీలక నిందితుడిగా గుర్తింపు పొందాడు.ఈ కేసుల్లో అతని పాత్రను సూచించే పలు ఆధారాలను భారత ఏజెన్సీలు అమెరికా అధికారులకు సమర్పించాయి.

ఈ అప్పగింతలో మరో ముఖ్యమైన అంశం—బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ అమెరికాలోనే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్. ఈ పిటిషన్‌లో, అన్మోల్ భారత న్యాయ వ్యవస్థకు తప్పించుకోవడానికి విదేశాల్లో దాక్కొన్నాడని, అతడిని తిరిగి భారత్‌కు పంపించాలని స్పష్టమైన విన్నపం చేశారు. ఆ వాదన కోర్టులో బలంగా నిలబడటంతో US అధికారులు అన్మోల్‌పై చర్యలు వేగవంతం చేసి, చివరకు అతడిని భారత అధికారులకు అప్పగించారు. ఇతర దేశాల్లో దాక్కున్న నేరగాళ్లను తీసుకురావడంలో కొన్నిసార్లు ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులను ఈ కేసులో భారత్ విజయవంతంగా అధిగమించినట్లు న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకంగా, అంతర్జాతీయ నేర ప్రపంచంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యను చాలా ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు.

అన్మోల్ భారత్‌కి చేరడంతో, సిద్దిఖీ హత్యాయత్నం కేసు, సల్మాన్ ఖాన్‌ పై దాడి బెదిరింపులు, ఇతర ఎక్స్టోర్షన్ కేసుల దర్యాప్తు వేగం మరింత పెరగనున్నది. అతడు అందించే సమాచారం బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలపై కీలకమైన లింకులను బయటపెట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com