'ఆంధ్ర కింగ్ తాలూకా' నాకు చాలా ఎమోషనల్ ఫిలిం: హీరో రామ్
- November 19, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది.
ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈవెంట్ లో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫైర్ వర్క్స్ ప్రేక్షకులు కట్టిపడేశాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండగలా జరిగింది.
అంధ్రా కింగ్ సూర్యకు వీర అభిమాని అయిన సాగర్…సినిమా ప్రింట్ ఆలస్యంగా వస్తే థియేటర్ గ్లాస్ పగలగొతాడు, తన హీరో కోసం కాలేజీలో గొడవలు పడతాడు, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దక్కడం తన ప్రైడ్ కానీ అతని ఈ పిచ్చిలోనే ప్రేమ చూసే ఒకరు ఉన్నారు. ఆమెకు సాగర్ ఫ్యాన్ కాదు తనే హీరో.ప్రేమకథ, అభిమానంతో నిండిన అతని జీవితం సరదాగా అనిపిస్తున్నప్పుడు, ఒక థియేటర్ యజమాని చేసిన అవమానం సాగర్ ని కదిలిస్తుంది. ఇక నిజమైన స్టార్ ఎప్పుడూ స్క్రీన్ వెనుకే ఉండాలని నమ్మే సూపర్‌స్టార్ సూర్య, తన పెద్ద ఫ్యాన్ కోసం మాత్రం ఈసారి తన నియమాలను బ్రేక్ చేయాల్సి వస్తుంది.
ఈ కథను దర్శకుడు మహేష్ బాబు ప్రేమ, అభిమానం, సినిమా క్రేజ్, భావోద్వేగాలతో అద్భుతంగా చూపించాడు.ప్రతి క్షణం నిజమైన ఎమోషన్స్ అందిస్తుంది. సినీ ప్రేమికుల అభిమానం ఎంత సహజంగా చూపించారో, ప్రతి ఫ్యాన్ తనను తాను ఇందులో చూసుకుంటాడు. ప్రేమకథ కూడా ఫ్రెష్‌గా, అందరికీ నచ్చేలా వుంది.ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు గుండెను తాకుతాయి.
సాగర్ పాత్రలో రామ్ పోతినేని కెరీర్లోనే అత్యుత్తమ నటన ఇచ్చారు.ఫ్యాన్‌గా, ప్రేమికుడిగా, పట్టుదలతో కూడిన యువకుడిగా..మనసుకు హత్తుకునేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.భాగ్యశ్రీ బోర్సే ప్రేమికురాలిగా ఆకట్టుకునే అందంతో మనసును దోచేస్తుంది. స్టార్ హీరోగా ఉపేంద్ర ప్రెజెన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సాగర్ బెస్ట్ ఫ్రెండ్‌గా రాహుల్ రామకృష్ణ పాత్ర కథకు కీలకం. ఇద్దరి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
సిద్ధార్థ్ నుని సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది.ప్రతి ఫ్రేమ్‌లోనూ సాగర్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు. సంగీత దర్శకులు వివేక్–మెర్విన్ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్గా సరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు గ్రాండ్‌గా, రిచ్‌గా వున్నాయి. ఎడిటర్ శ్రీకార్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా వర్క్ కూడా బిగ్ ఎసెట్. మొత్తం మీద, ట్రైలర్ చాలా ఫ్రెష్‌గా, అద్భుతంగా ఉంది.ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ ట్రైలర్ కట్ గా నిలిచింది. ట్రైలర్ ప్రకారం చూస్తే, అంధ్రా కింగ్ తాలూకా రామ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కూ నచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హలో కర్నూల్. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేశాను. కానీ ఇది నాకు చాలా ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు. ఇప్పటివరకు నేను మిమ్మల్ని లైవ్ లో చూడలేదు.నన్ను మీరు చూడలేదు. కానీ ఎప్పుడో కలిసాం అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఈ సినిమా. ఆంధ్ర కింగ్ అనేది నా కెరీర్ లోనే మోస్ట్ పర్సనల్ ఫిల్మ్. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన టీం తో కలిసి చేసిన సినిమా ఇది. మైత్రి రవి గారికి థాంక్యూ. ఆయన సినిమాని నెత్తి మీదనే పెట్టుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మర్విన్ తెలుగులో వన్ అఫ్ ది ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. నువ్వు ఉంటే చాల్లే చిన్ని గుండెలో సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాలో నేను అభిమాని పాత్ర పోషించాను. సూపర్ స్టార్ పాత్రని ఉపేంద్ర పోషించారు.ఈ సినిమా చూసిన తర్వాత ఆ కనెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఇలాంటి కథ చేయగలడు అనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది అభిమానుల సినిమా. భాగ్యశ్రీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. గ్లామరస్ గా కనిపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ తెలుగు సినిమాలో చాలా ఏళ్ల తర్వాత వచ్చిందని భావిస్తున్నాను. తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ మహేష్ థియేటర్ కాదు మనలో సౌండ్ వచ్చే సినిమా చేశాడు. అద్భుతమైన సినిమా తీశాడు. తనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై డియర్ ఫ్యాన్..తమ్ముడు..నువ్వు వున్నావని నాకు తెలియకపోవచ్చు. కానీ నేనొక్కడినే ఉన్నానంటే కారణం నువ్వే. లవ్ యు కర్నూల్. 27న థియేటర్స్ లో కలుద్దాం. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోవడానికి రెడీగా ఉండండి. థాంక్యూ.
హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ..హలో కర్నూల్. మీ అందరికీ పాటలు ట్రైలర్ నచ్చిందంటే సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.రామ్ ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.నాకు ఈ కథలో భాగం చేసిన డైరెక్టర్ మహేష్ గారికి థాంక్యూ. మైత్రి రవి గారికి థాంక్యూ. వివేక్ మర్విన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నవంబర్ 27న ఈ సినిమా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
డైరెక్టర్ మహేష్ బాబు.పి మాట్లాడుతూ..సహజంగా బాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ బూర్జ్ ఖలీఫా లో ట్రైలర్ లాంచ్ చేస్తుంటారు. మేము మా ట్రైలర్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు కొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.నిజంగా ఇది కన్నుల పండుగగా ఉంది. రామ్ గారి కెరీర్ లో ఇది అత్యున్నత స్థాయిలో నిలబడే సినిమా కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశాం. ఆ డిజైన్ వెనుక ఉన్న మా లక్ష్యం కూడా అదే. రామ్ గారు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా అందరం కలిసి చేశామని అనుకుంటున్నాను.వివేక్ మార్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కథకి చాలా దగ్గరగా ఉండే సాంగ్స్ ట్యూన్స్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ గారి లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసిన ఉపేంద్ర గారితో వర్క్ చేయడం కూడా అదృష్టం. భాగ్యశ్రీ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారు.ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ నవంబర్ 27న ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ..గుడ్ ఈవెనింగ్ కర్నూల్. ఇదే గ్రౌండ్లో సర్కార్ వారి పాట కోసం మహేష్ ని తీసుకొచ్చాం.మళ్ళీ ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. డ్రోన్ షో మిమ్మల్ని అందరిని అలరించిందని నమ్ముతున్నాం. మీ అందరికీ ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలని మేము అందరం చాలా వర్క్ చేసి చాలా నమ్మి ఈ సినిమాని చేసాం. కమర్షియల్ గా ఎంగేజింగ్ గా ఎమోషనల్ గా అన్ని రకాలుగా ఎక్స్ట్రార్డినరీ కంటెంట్ అవ్వాలి మనస్పూర్తిగా మేమందరం నమ్మి తీసిన సినిమా ఇది. ఈ సినిమా ఫుల్ గా ఎంకరేజ్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. వివేక్ మార్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఆర్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. డైరెక్టర్ మహేష్ గారు అద్భుతమైన సినిమా తీశారు. చాలా కాలం మాట్లాడుకునే సినిమా ఇది. మా హీరో రామ్ గారు హీరోయిన్ భాగ్యశ్రీ గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఈ సినిమాకి ప్రాణం పోశారు. వాళ్ళిద్దరినీ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరందరూ కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. నవంబర్ 27న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
సంగీత దర్శకులు వివేక్ & మెర్విన్ మాట్లాడుతూ..హలో కర్నూల్.ఇది మాకు ఫస్ట్ తెలుగు సినిమా.ఇంత పెద్ద సినిమాలో మేము భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అందుకు ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ ఆల్బమ్ నచ్చిందని అనుకుంటున్నాం. హీరో రామ్ గారికి , డైరెక్టర్ మహేష్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్యూ. నవంబర్ 27న మీ అందరూ కూడా చాలా స్పెషల్ ఫిల్మ్‌ని చూడబోతున్నారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







