12A రైల్వే కాలనీ' పై కాన్ఫిడెంట్ గా వున్నాం: హీరో అల్లరి నరేష్
- November 19, 2025
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. 64 సినిమాలు చేశాను.రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టాక్ ఏంటి, ఓపెనింగ్స్ ఏమిటి ? ఎలాంటి రివ్యూస్ వస్తాయనే టెన్షన్ గా ఉంటుంది.కానీ నాని ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. తనకి ఎక్కడ టెన్షన్ లేదు( నవ్వుతూ) ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. నాంది సినిమా చేస్తున్నప్పుడు విజయ్ ఎలా చేస్తాడో అని కన్సర్న్ తో ఉండేవారు హరీష్ గారు. అలాంటి గురువు ఎవరికైనా ఉండాలి. అనిల్ గారు కూడా నాని ఈ సినిమా చేస్తున్నప్పుడు అంతే కేర్ తీసుకున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారిని ఎవరు ఆపలేరు. నేను 35 మంది కొత్త డైరెక్టర్స్ తో పని చేశాను.దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు. కొంతమంది అవ్వలేదు. ఒక డైరెక్టర్ గారి అబ్బాయిగా నేను వాళ్ళ అందరితో ఎప్పుడూ ఉంటాను. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. గెటప్ శ్రీను హర్ష జీవన్ ఎక్కడ విసుక్కోకుండా చాలా ఓపికతో ఈ సినిమా చేశారు. రమేష్ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.ఇలాంటి సినిమాలకి విజువల్స్ బ్యాగ్రౌండ్ స్కోర్స్ సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉండాలి.ఈ మూడింటిలో మేము సక్సెస్ అయ్యాం.భీమ్స్ కి నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. నువ్వా నేనా సమయంలో బీమ్స్ లో ఎంత కసి ఉందో ఇప్పుడు అంతే ఉంది.తను చాలా బిజీగా ఉండడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత నా గురించి కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు. కామాక్షి, అనిల్ ప్రొఫెషనల్ గా డాక్టర్స్.పొలిమేర లాంటి సినిమా చేసి తమను తాము ప్రూవ్ చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా సిన్సియర్ గా కష్టపడ్డారు. నా సామి రంగ చేసినప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది.చిట్టూరి గారు సెంటిమెంట్ అన్నారు.(నవ్వుతూ) నిజంగా సినిమా పెద్ద హిట్ అయింది.ఈ సినిమా చేసినప్పుడు కూడా నా భుజానికి గాయమైంది.తప్పకుండా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఈ సినిమాని తీశారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది.తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ...ఈ సినిమా ట్రైలర్ చూడగానే డైరెక్టర్ నాని గురించి మాట్లాడాలనిపించింది.ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. తనే ఎడిటర్ అని చెప్పారు. ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే సినిమా డబల్ కా మీఠా.నేను పొలిమేర ఫంక్షన్ కి వెళ్ళాను. తర్వాత పార్ట్ 2 వచ్చింది. అది మరిన్ని పార్ట్స్ రావచ్చు.అలాగే ధమాకా ఫంక్షన్ కి వెళ్ళాను. అది ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాగే నరేష్ గారు విజయ్ నాంది సినిమాకి వెళ్లాను. అదే రకంగా నిర్మాత శ్రీనుకి పవన్ కి అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ను.ఈవివి సినిమాలు చూసిన తర్వాత రైటర్ గా కావాలని డిసైడ్ అయ్యాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది.ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం నాకు రాలేదు.అందుకే నరేష్ ని ఎప్పుడు కలిసి అవకాశం ఉన్న వచ్చేస్తాను. ఒక దర్శకుడికి అవకాశం ఇస్తే ఎంతో మందికి అవకాశం ఇచ్చినట్టు. నరేష్ 35 మంది దర్శకులను పరిచయం చేశారు. ఆ రకంగా చూస్తుంటే కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చారు.నరేష్ ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి అల్లరి నరేష్ అన్నారు.ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ తో వెళ్లిన రెడీగా ఉంటారు. కాబట్టి ఆయన అల్లరి నరేష్ ఇక పై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను.నవంబర్ 21 న సినిమాని అందరూ నాతో పాటు చూడాలని కోరుకుంటున్నాను.
విఐ ఆనంద్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ఈ సినిమా ప్రతి కంటెంట్, ప్రతి షాట్ ఒక కథను చెప్తుంది. అది నాకు బాగా నచ్చింది.ఈ రోజుల్లో కంటెంట్ లేని ఫిలిం ఆడడం లేదు. రైల్వే కాలనీలో చాలా ఎంగేజింగ్ కంటెంట్ ఉంది.నిర్మాతలు శ్రీనివాస్,పవన్ గారికి కంగ్రాజులేషన్స్.ఈ టీమ్ అందరు చూస్తుంటే మంచి హిట్ వైబ్ వచ్చింది. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి పనిచేశారు.మీ ఫ్యామిలీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ విజువల్స్ సుపర్బ్ గా ఉన్నాయి.నరేష్ అంటే నాకు చాలా ఇష్టం.ఆయన ప్రతి సినిమాకి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు.డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు.ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ విజయ కనకమేడల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాంది సినిమాకి మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో చేశాము. దానికి సిసి వర్క్ అంతా నానియే చేశాడు. తను ఇప్పుడు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.నరేష్ చాలా మంది దర్శకులని పరిచయం చేశారు. నాని 35వ దర్శకుడుని భావిస్తున్నాను.తనకి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి.నరేష్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.ఆయన కొత్త కొత్త జోనర్స్ లో కొత్త కొత్త దర్శకులని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను.నవంబర్ 21న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను
మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాట్లాడుతూ..నరేష్ కి థాంక్యూ. 2011 నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాను.ఇన్ని పాటలు చేయడానికి ఒక పాట ప్రాణం పోతుంది.అదే నరేష్ వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోను..ఆ పాట నాకు ప్రాణం పోస్తే అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది.ఇందులో మూడు పాటలు నా దగ్గర నుంచి వచ్చేయండి దానికి కారణం అనిల్ అన్న చిట్టూరి శ్రీనివాసరావు గారు అల్లరి నరేష్ గారు. సినిమాలో నా నుంచి కొత్త రకం పాటలు మీరు విన్నారు. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది అనేది మన ఊహకు అందదు.ఈ సినిమా స్క్రీన్ ప్లే మ్యూజిక్ విజువల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. నవంబర్ 21 సినిమా మీ ముందుకు వస్తుంది తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ కామాక్షి మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ఈ సినిమాకు పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే మోడల్గా యాక్టర్ గా ప్రయత్నించాను. పొలిమేర సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమానిచ్చిన అనిల్ కి థాంక్యూ.మా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి థాంక్యూ,.ఈ సినిమాలో నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇవ్వడం అంత ఈజీ విషయం కాదు. శ్రీనివాస్,పవన్ కి స్పెషల్ థాంక్యూ. ఆరాధన చాలా స్పెషల్ క్యారెక్టర్.నా కెరియర్ లో గుర్తుండిపోతుంది.అల్లరి నరేష్ కి నేను పెద్ద ఫ్యాన్ ని.ఆయన సినిమాలన్నీ చూసాను ఆయన ఎన్నో రకాల పాత్రలని అవలీలగా చేశారు. ఈ సినిమా మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. హరీష్,విజయ్, విఐ ఆనంద్ కి అందరికీ థాంక్యు. ఇలాంటి కొత్త కథని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. ఈ కథని నమ్మి ముందుకు వచ్చిన నరేష్ గారికి ధన్యవాదాలు.నరేష్ సింగిల్ టేక్ పెర్ఫార్మర్. ఆయనతో వర్క్ చేయడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను.ఆయన కెరీర్లు గమ్యం నాంది12A రైల్వే కాలనీ టాప్ త్రీలో ఉంటాయని భావిస్తున్నాను. సినిమా అదిరిపోయింది. నేనే కద రాశాను కానీ క్లైమాక్స్ వచ్చేసరికి నాకే గూస్బమ్స్ వచ్చాయి. ఇలాంటి సినిమా ని థియేటర్స్ లో మిస్ అవ్వద్దు. ఈ కథని ముందుగా యాక్సెప్ట్ చేసిన నిర్మాతలు శ్రీనివాస్ గారికి థాంక్యూ. కామాక్షి నా డియర్ ఫ్రెండ్. నా ప్రతి సినిమాలో తను ఉంటుంది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవన్ వైవా హర్ష గెటప్ శీను అందరు కూడా అద్భుతంగా పెర్ఫాం చేశారు. సాయి కుమార్ గారు ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉపయోగపడింది. రమేష్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తనకి మరిన్ని అవార్డ్స్ వస్తాయి. బీమ్స్ మూడు పాటలు మూడు ఆణిముత్యాలుగా ఇచ్చారు. రీరికార్డింగ్ అదిరిపోయింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. రైటర్ గురించి డైరెక్టర్ గురించి గూగుల్ చేస్తారు. తర్వాత కథను ఎవరు ఊహించలేరు. కావలసిన ట్విస్టులు ఉన్నాయి. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది.
డైరెక్టర్ నాని మాట్లాడుతూ...మా నాన్నక్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలాంటి పెద్ద వేదికల మీద మాట్లాడాలని ఆయన కోరిక. కానీ 2014లో ఆయన చనిపోయారు. నేను డైరెక్ట్ అవ్వడానికి 15 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఈ వేదికలో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.నాన్న ఎక్కడున్నా చూస్తారని నమ్ముతున్నాను.ఈ ఇవన్నీ సాధ్యమైంది అనిల్ అన్న వలన. ఆయన ఎప్పుడూ కూడా నాకు భుజం తడుతూనే ఉన్నారు. 21న థియేటర్స్ లో చూడండి. ఒక మంచి సినిమా చూశారని ఫీల్ తో బయటికి వెళ్తారు.నా ఫస్ట్ సినిమాకి బీమ్స్ గారు దొరకడం అదృష్టం. సాంగ్స్ ఇరగదీశారు. ఈ సినిమాలో వేరే లెవెల్ బిజీఎం ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.
వైవా హర్ష మాట్లాడుతూ..అందరికి నమస్కారం.థాంక్యూ నాని అన్న.సినిమాని ఫస్ట్ టైమర్ లా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఫిలిం మేకర్లకు తీశారు.బీమ్స్ అన్న మ్యూజిక్ అద్రిపోయే ఇచ్చారు.నరేష్ తో ఇది నాలుగో సినిమా. ఆయన మంచితనానికి మారుపేరు.నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు
- పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు..
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం







