చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!

- November 19, 2025 , by Maagulf
చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!

దోహా: ఖతార్ ఫౌండేషన్ ఫర్ సోషల్ వర్క్ పరిధిలోని కేంద్రాలలో ఒకటైన ప్రొటెక్షన్ అండ్ సోషల్ రిహాబిలిటేషన్ సెంటర్ (అమన్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో ఇంటరాక్టివ్ డిజిటల్ గేమ్ “జర్నీ ఆఫ్ సేఫ్టీ”ని ప్రారంభించింది. నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవం నేపథ్యంలో దీనిని ఆవిష్కరించారు. విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖలోని ప్రైవేట్ విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఒమర్ అబ్దుల్ అజీజ్ అల్-నమాతో పాటు వివిధ రంగాలలోని సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖతార్ ఫౌండేషన్‌లో ఈ గేమ్ కోసం ఒక ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు. 

పిల్లల కోసం ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్‌లను రూపొందించడంలో అమన్ ముందుంటుందని అమన్ సెంటర్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫదేల్ బిన్ మొహమ్మద్ అల్-కాబి చెప్పారు. భవిష్యత్ తరం పిల్లలకు సమగ్ర రక్షణను అందించడానికి అన్ని రంగాలు కలిసికట్టుగా ముందుకు రావాలని అల్-కాబి కోరారు.

జర్నీ ఆఫ్ సేఫ్టీ అనేది ఖతార్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటరాక్టివ్ గేమ్ అని అమన్ సెంటర్‌లోని కమ్యూనిటీ అవేర్‌నెస్ డైరెక్టర్ బఖితా అల్-గియాతిన్ వివరించారు. 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల బాల బాలికల కోసం రూపొందించబడిన ఈ గేమ్, ఖతార్‌లోని వివిధ మైలురాళ్ల ద్వారా పిల్లలను ప్రయాణంలోకి తీసుకెళుతుందన్నారు. భద్రతకు సంబంధించిన ప్రశ్నలు మరియు విద్యాపరమైన మెసేజులు ఆకర్షణీయమైన ఫార్మాట్‌లో ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ గేమ్ ద్వారా పిల్లల్లో సామాజిక రక్షణపై అవగాహన పెరగడంతోపాటు ఇంట్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో ఎలా సురక్షితంగా ఉండాలో నేర్పించడం.. సానుకూల వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com