భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- November 20, 2025
తిరుమల: భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు విజ్ఞప్తి చేశారు.
Global Hindu Heritage Foundation, http://savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల విశ్వాసం నిలబెట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!
- సూడాన్ యుద్ధాన్ని ముగించడానికి కృషి..ట్రంప్
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ రద్దు, మళ్లింపు..!!







