ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- March 12, 2026
యూఏఈః యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అప్పటివరకు పరిస్థితుల్లో మార్పులుండే అవకాశం కూడా ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM)లోని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ అన్నారు. అల్పపీడనం కొనసాగితే ఈద్ సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
దుబాయ్, అబుదాబి మరియు రాస్ అల్ ఖైమా వంటి ఉత్తర ఎమిరేట్‌లతో సహా యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదైందని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ హబీబ్ వివరించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 38–39°C వరకు చేరుకుంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







