2031 నాటికి మొబైల్ మార్కెట్‌లో 5G రాజ్యం

- November 20, 2025 , by Maagulf
2031 నాటికి మొబైల్ మార్కెట్‌లో 5G రాజ్యం

న్యూ ఢిల్లీ: ఎరిక్సన్ తాజా మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారత్‌లో 5G(India 5G) స్వీకరణ వేగం విపరీతంగా పెరగనుంది. 2031 చివరి నాటికి దేశంలో 5G సబ్‌స్క్రిప్షన్లు 100 కోట్ల మార్క్‌ను దాటుతాయనే అంచనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో, 2031 నాటికి దేశంలోని మొత్తం మొబైల్ కనెక్షన్లలో 79 శాతం వరకు 5G ఆధిపత్యం ఉండబోతోందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం 5G అడాప్షన్ ఇప్పటికే మంచి స్థాయిలో ఉండగా, 2025 చివరి నాటికి సుమారు 394 మిలియన్ 5G కనెక్షన్లు నమోదయ్యాయి. ఇది ఆ సమయంలో ఉన్న మొత్తం సబ్‌స్క్రిప్షన్లలో 32 శాతం వాటా అని నివేదిక పేర్కొంది.

భారత్‌లో మొబైల్ డేటా వినియోగం ప్రపంచంతో పోల్చితే చాలా ఎక్కువ. ప్రజల చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు పెరగడం, చౌకైన డేటా ప్లాన్లు, OTT వినియోగం పెరగడం వల్ల డేటాపై భారీ డిమాండ్ ఏర్పడింది. ఎరిక్సన్ ప్రకారం, భారతీయ యూజర్లు రోజురోజుకూ అధిక డేటా వాడుతుండడం, ఆ డిమాండ్‌కు అనుగుణంగా టెలికాం కంపెనీలు నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నాయి. ఇదే 5G విస్తరణకు ప్రధాన కారణమని పేర్కొంది.

భారత్‌లో 5G(India 5G) స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌కూ చేరాయి. రూ.10,000–15,000 మధ్య ధరల్లో కూడా 5G ఫోన్లు అందుబాటులోకి రావడంతో, మరింత మంది యూజర్లు 5G వైపు అడుగులు వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ విస్తరణ 5G సబ్‌స్క్రిప్షన్ల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని రిపోర్ట్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com