3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

- November 23, 2025 , by Maagulf
3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి  సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుండి 5వ తేదీవరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో నందమూరి తారకరామారావు వేదిక పై  నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జనవరి 3వ తారీఖున ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రారంభోత్సవ సభకు సతీ సమేతంగా   ముఖ్య అతిథిగా విచ్చేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి కార్యాలయంలో వారిని కలసి డా.గజల్ శ్రీనివాస్ ఆహ్వానించారు..

ఆయన ఎంతో సానుకూలం గా స్పందించారని, మాతృ భాషా వికాసం కోసం ప్రజలందరూ  కలసి కట్టుగా పని చేయాలని. అన్నారని తెలుగు మహా సభల ముఖ్య సమన్వయ కర్తలు పి.రామచంద్ర రాజు,వాసిరెడ్డి విద్యా సాగర్ లు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com