అఖండ 2: తాండవం ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: శివరాజ్ కుమార్
- November 23, 2025
నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ రోజు మేకర్స్ కర్నాటకలో జరిగిన భారీ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ చేశారు.కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. కన్నడ ప్రజలకు నమస్కారం. వర్షానికి లెక్కచేయకుండా గట్టులను దాటి పడి లేచే ఇక్కడికి విచ్చేసిన తమ్ముడు శివన్న, అలాగే నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరిని గుండెల్లో నిలిపిన కారణజన్మునుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మా నాన్ననందమూరి తారక రామారావుకి నమస్కరిస్తున్నాను.మా నాన్నఇటు కన్నడకు రాజ్ కుమార్. వాళ్లు చేయని పాత్ర లేదు. శివరాజ్ కుమార్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న శివన్నకు ఆశీర్వాదం అందిస్తున్నాను.ఉదయం వర్ష సూచన లేదు. మేము హోటల్ నుంచి వచ్చేటప్పటికి కుంభవృష్టి కురిసింది. మళ్లీ వేదికపైకి వచ్చే సరికి వర్షం లేదు.ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ కేవలం తెలుగు సినిమా కాదు కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా. కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో అఖండ చిత్రాన్ని విడుదల చేశాం.ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి.ఆ సినిమాలో పిల్లలు ప్రకృతి ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడు చూపించడం జరిగింది.యువత మీరందరూ మంచిదారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది.ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు చూస్తారు. బోయపాటి గారితో నాకు ఇది నాలుగో సినిమా. అఖండ తాండవం సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పాత్రల్లో జీవించారు. నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నన్ను ఆవహిస్తుంది. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది.ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. నిర్మాత గోపి గారు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. తమన్ థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి శివుడు పూనాడు.ఈ సినిమా సక్సెస్ మీట్ ని మళ్ళీ ఇక్కడే జరుపుతాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖ కి నా కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హిట్ కొడుతున్నాం' అని చెప్తున్నా.మీ అందరి అభిరుచులు నాకు తెలుసు. ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్..అందరికీ నమస్కారం. మా బ్రదర్ బాలయ్య అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఒకే కుటుంబం. మేమిద్దరం బ్రదర్స్ లాగే ఉంటాము. బాలయ్య గారి నటన డైలాగులు యాక్షన్ లో ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంత వర్షంలో కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ అభిమానానికి ఆ వర్షం కూడా ఆగింది.ఈవెంట్ అద్భుతంగా జరిగింది. మీ అందరి ప్రేమ నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము .డిసెంబర్ 5న తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంతగానో అలరిస్తుంది.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది శివతత్వంతో ఉన్న అద్భుతమైన సినిమా. శివన్న చేతుల మీదగా ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంత వర్షంలో కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైన విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. మీరు చూడబోయే సినిమా ఎలా ఉంటుందంటే...దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ధర్మమనే త్రిశూలం పట్టుకుని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అఖండ తాండవం మీరు చూస్తారు.ఈ సక్సెస్ మీట్ కూడా ఇక్కడే పెడతాం. అందరికీ థాంక్యు
ఆది పినిశెట్టి మాట్లాడుతూ..ట్రైలర్ ని లాంచ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన శివన్నకి థాంక్యూ. ట్రైలర్ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. బోయపాటి గారితో సరైనోడు సినిమా పనిచేశాను. మళ్ళీ ఈ సినిమాకు పని చేయడం చాలా ఆనందంగా ఉంది. బాలయ్య,బోయపాటి కాంబినేషన్ అద్భుతం.ఈ సినిమా మామూలుగా ఉండదు. సినిమా మొదలైనప్పుడు నేల టికెట్ లో కూర్చున్న వాళ్ళు పూర్తయ్యేసరికి బాల్కనీలో ఉంటారు.
హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ...అందరికి నమస్కారం.ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను.బోయపాటి సినిమాలో చేయడం నా అదృష్టం. బాలయ్య తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా సరదాగా గడిచింది. డిసెంబర్ 5న అందరూ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ..మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యఅతిథిగా వచ్చిన శివరాజ్ కుమార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ఉత్సాహం కోసమే మేం ఎంతో కష్టపడి సినిమా చేశాం. డిసెంబర్ 5న అంతా అఖండ తాండవ శబ్దమే'. భారీ సంఖ్యలో అభిమానులు, మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక అద్భుతంగా జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







