ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్య సేన్

- November 23, 2025 , by Maagulf
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్న లక్ష్య సేన్

భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో (Australian Open Super 500) టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు లక్ష్యసేన్. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు యుషి టనాకాను 21-15, 21-11 తేడాతో సునాయాసంగా ఓడించి విజేతగా నిలిచాడు.

ఈ ఫైనల్ మ్యాచ్ లక్ష్య సేన్ కెరీర్‌లోనే అత్యంత సులువైన ఫైనల్స్‌లో ఒకటిగా నిలిచింది.కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో టనాకా పూర్తిగా తేలిపోయాడు. అతను కొట్టిన స్మాష్‌లు చాలాసార్లు బయటకు వెళ్లగా, నెట్ వద్ద చేసిన తప్పిదాలు కూడా లక్ష్య సేన్‌ (Lakshya Sen) కు కలిసొచ్చాయి. దీంతో లక్ష్య సేన్ పెద్దగా శ్రమించకుండానే, ప్రత్యర్థి తప్పిదాలను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాడు.

మూడో సూపర్ 500 టైటిల్
తొలి గేమ్‌లో 15-13 వద్ద టనాకా కాస్త పోటీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత లక్ష్య సేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. లక్ష్య సేన్‌కు ఇది మూడో సూపర్ 500 టైటిల్. ఈ ఏడాది హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరినా ఓటమిపాలైన అతను, ఈసారి మాత్రం టైటిల్‌ను చేజార్చుకోలేదు. సెమీఫైనల్‌లో 85 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి గెలిచిన లక్ష్య సేన్‌కు,

ఫైనల్ మాత్రం చాలా తేలికైంది.విజయం సాధించిన అనంతరం లక్ష్య సేన్ తన రెండు చేతి వేళ్లను చెవుల్లో పెట్టుకుని, కళ్లు మూసుకుని సంబరాలు చేసుకున్నాడు. ఈ వారం తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడికి ఇది నిదర్శనంగా కనిపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ తర్వాత పట్టుదలతో రాణిస్తున్న లక్ష్య సేన్.. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయినా, ఈ టైటిల్‌తో అంతర్జాతీయ పర్యటనను ఘనంగా ముగించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com