అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- November 23, 2025
అమరావతి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై ముఖ్యమైన అప్డేట్ వెలువడింది.ఎన్టీఆర్ జిల్లా గ్రామాల నుంచి 3 ఏ ప్రతిపాదనలు ఇప్పటికే జాతీయ రహదారుల అధికారుల దృష్టికి చేరాయి. సోమవారం నాటికి కృష్ణా జిల్లా గ్రామాల ప్రతిపాదనలు కూడా సమర్పించనుండగా, వీటిని పరిశీలించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రోడ్ ప్రాజెక్ట్ ఏలూరు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడనుంది. ప్రతిపాదనల్లో భూమి వివరాలు, సర్వే నంబర్లు, రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమి పరిమాణం వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి.
190 కిలోమీటర్ల పొడవుతో
ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు వారి పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత డిల్లీలోని NHAI కార్యాలయానికి మరియు రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు సమర్పిస్తారు. ఇప్పటికే ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లా ప్రతిపాదనలు డిల్లీలో ఆమోదం పొందాయి. మరికొద్ది రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రతిపాదనల సమీక్ష కూడా పూర్తి చేసి, ఆమోదం తర్వాత భూసేకరణను ప్రారంభించనున్నారు.
ఈ ఓఆర్ఆర్ నిర్మాణం 97 గ్రామాల మీదుగా ఆరు వరుసల రోడ్లుగా, మొత్తం 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.24,791 కోట్లుగా అంచనా వేయబడింది. నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమరావతి ప్రాంతంలో రవాణా మరింత సులభమవుతుంది, పట్టణాల మధ్య ట్రాఫిక్ కష్టాలు తగ్గి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం అవుతుంది.
తాజా వార్తలు
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!
- అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన







