ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- November 24, 2025
న్యూ ఢిల్లీ: విమాన ప్రయాణాల్లో భద్రతా కారణాల వల్ల కొన్ని వస్తువులను క్యాబిన్ బ్యాగ్‌లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం.వాటి వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో ఎయిర్‌లైన్లు (Airline)కఠినంగా నియంత్రణలు అమలు చేస్తాయి.ముఖ్యంగా నిషేధిత వస్తువులు ఇవి...
1. పూర్తి కొబ్బరికాయ–ప్రెషర్ మార్పులతో పగిలే ప్రమాదం.
2. కేన్డ్ ఫుడ్–అధిక పీడనంలో టిన్నులు పేలిపోయే అవకాశం.
3. సాఫ్ట్ చీజ్–లిక్విడ్‌గా పరిగణిస్తారు;పరిమితికి మించినట్లైతే అనుమతి లేదు.
4. విత్తనాలు–కొన్ని దేశాలు బయోసెక్యూరిటీ కారణాల వల్ల నిషేధిస్తాయి.
5. ప్రొటీన్ పౌడర్లు–పొడి పదార్థాల స్క్రీనింగ్ కఠినం; కొన్ని ప్రాంతాల్లో పరిమితులు.
6. దురియన్ పండు–తీవ్రమైన వాసన కారణంగా అనుమతి లేదు.
7. నిషేధ రసాయనాలతో ఉన్న మందులు–రిస్క్ ఉన్న కెమికల్స్ కారణంగా బోర్డింగ్ నిషేధం.
8. గ్లో స్టిక్స్–కెమికల్ లీక్ ప్రమాదం.
9. టాయ్ వెపన్స్–నిజమైన ఆయుధాల్లా కనిపిస్తాయి కాబట్టి నిషేధితం.
10. స్నో గ్లోబ్స్–లోపలి ద్రవ పరిమాణం తనిఖీ చేయలేకపోవడంతో అనుమతి లేదు.
విమాన ప్రయాణంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ వస్తువులను బ్యాగ్ నుంచి తీసేయడం మంచిది.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







