సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- November 24, 2025
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 5.83 కోట్లతో 28 అంగన్వాడీ భవనాల నిర్మాణం, రూ.5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో 10 GP భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఇంకా రూ.3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ).. కోటి రూపాయలతో కొడంగల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ. 1.40 కోట్లతో కొడంగల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
రూ. 4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇక రూ.2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాలను ప్రారంభించారు. రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తాజా వార్తలు
- డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!







